16 June, 2026 | 9:43 PM

టీపీసీసీ ఎన్నికల సమన్వయకర్తగా శశిభూషణ్ కాచె నియామకం

16-06-2026 08:47 PM

మంథని,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ  ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ తరపున క్రియాశీలక పర్యవేక్షణ కోసం టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ ఎన్నికల కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు మంథని కి చెందిన శశిభూషణ్ కాచె ను ఐదు జిల్లాలకు సమన్వయకర్తగా (కో-ఆర్డినేటర్) నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.

బాధ్యతలు అప్పగించిన జిల్లాలు

శశిభూషణ్ కాచె పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఈ ఐదు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎటువంటి లోపాలు జరగకుండా, పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ ఈ బాధ్యతను ఆయన నిర్వర్తించనున్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న శశిభూషణ్ కాచెకు అప్పగించిన ఈ కీలక బాధ్యతపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.