30 June, 2026 | 10:58 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నమూనా ఇంటిని పరిశీలించిన కలెక్టర్

11-04-2025 01:20 AM

సూర్యాపేట,ఏప్రిల్10(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద నిర్మించే నమూనా ఇంటిని సూర్యాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  పరిశీలించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసి 5 లక్షల వ్యయం తో ఇందిరమ్మ ఇండ్లను ఎలా నిర్మించాలో ఇంటికి ఉపయోగించిన సామాగ్రి, చేసిన ఖర్చుల వివరాలతో కూడిన పట్టికను ఇంటి ముందు ప్రదర్శించి లబ్ధిదారులకి అవగాహన కల్పించటం జరుగుతుందని తెలిపారు. అనంతరం మండల ప్రజా పరిషత్  కార్యాలయంని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు.

నిరుద్యోగ యువతకి  స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుందని ఇట్టి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని, రూరల్ ప్రాంతాలకు చెందిన వారు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అలాగే అర్బన్ ప్రాంతంకు చెందిన వారు మున్సిపాలిటి కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని,

రఖాస్తులని అధికారులు పరిశీలించిన తదుపరి జూన్ 2 వ తేదీన లబ్ధిదారుల జాబితా ప్రకటించటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ బాలకృష్ణ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.