18 June, 2026 | 1:37 AM

‘నక్షా’ సర్వేను పరిశీలించిన కలెక్టర్

18-06-2026 12:00 AM

మహబూబాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన నక్ష సర్వే కార్యక్రమంలో మహబూబాబాద్ పట్టణాన్ని ఎంపిక చేయగా, బుధవారం పట్టణ పరిధిలో నిర్వహిస్తున్న గృహ సర్వేను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పట్టణంలోని గుమ్మడూరు, జామండ్లపల్లి, తదితర ప్రదేశాలలో కొనసాగుతున్న ఇండ్ల సర్వేను కలెక్టర్ స్వయంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యల గురించి ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్లకు తగు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో పక్కాగా సర్వే నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే సూచించిన ప్రకారం నక్ష సర్వే కొనసాగుతుందని, ల్యాండ్ సర్వే ఏడి శ్రీనివాస్, తహసిల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్ కలెక్టర్‌కు వివరించారు.