జర్నలిస్ట్ వీరన్న కుటుంబానికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చేయూత
వీరన్న సతీమణికి లక్ష రూపాయల చెక్కు అందజేత
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి
ముషీరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): కవాడిగూడ సాక్షి రిపోర్టర్‌గా పనిచేసి అనారోగ్యం తో మృతి చెందిన మద్దినేని వీరన్న కుటుంబానికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చేయూతనిచ్చింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మద్దినేని శ్రీలతకు ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
దీంతో పాటు ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రతి నెల 3వేల రూపాయల పెన్షన్ కూడా రానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మద్దినేని వీరన్న సతీమణి శ్రీలత కుమారుడు దినేష్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నరసయ్య, సాక్షి ముషీరాబాద్ ఇన్చార్జ్ చింతరెడ్డి వీరారెడ్డి పాల్గొన్నారు.






