28 August, 2026 | 5:19 AM

రుద్రంగి మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

27-08-2026 08:21 PM

రుద్రంగి,(విజయక్రాంతి): రుద్రంగి మండల  ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో రుద్రంగి మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. మండల అధ్యక్షులుగా సింగారపు గంగాధర్,అధికార ప్రతినిధిగా దయ్యాల రమేష్,ఉపాధ్యక్షులుగా సావన్ పెళ్లి చిన్న రెడ్డి, కార్యదర్శి లింగపెల్లి  సుదర్శన్,ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి పుట్ట రవన్న మాదిగ హాజరయ్యారు ఈరోజు సందర్బంగా వారు మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ ఆదేశాలను పాటించాలి.

ఆరోగ్యశ్రీ కార్డు ప్రదాత రేషన్ బియ్యం పెంపు, వికలాంగులకు చేయూత పింఛన్లు పెంపు తదితర విజయాలు సాధించామని తెలియజేశారు. అనగారిన వర్గాలకు అన్యాయం జరిగిన చోట భారత రాజ్యాంగానికి హాని తలపెట్టిన చోట తాము ముందు వరసలో  ఉండి పోరాడుతాము అన్నారు. ఈ కార్యక్రమంలో   ఆవునూరి ప్రభాకర్ మాదిగ,ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి కణపురం లక్ష్మణ్ మాదిగ,సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు బడుగు సంజీవ్,అక్కెనపల్లి నరసయ్య,దయ్యాల గంగరాజు,నేదురి సంజయ్, రోమల అశోక్,అక్కనిపల్లి శ్రీనివాస్,సానపల్లి రాజాం, ఎలగందుల ఆనంద్, సింగారపు శ్రీకాంత్, దయ్యాల దినేష్,  అక్కెనపల్లి నరసయ్య తదితరులు పాల్గొన్నారు