27 August, 2026 | 9:45 PM

ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి

27-08-2026 08:28 PM

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

కోరుట్ల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన సర్ ముసాయిదా గ్రామ సభలో  పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామసభల ద్వారా ఓటర్ల జాబితా వివరాలను ప్రజలకు చదివి వినిపించి, పారదర్శకంగా పరిశీలన చేపడుతున్నామని తెలిపారు.

ఇతర ప్రాంతాలకు శాశ్వతంగాతరలివెళ్లిన, మరణించిన ఓటర్లవివరాలను, సంబంధిత ఆధారాలతో నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం జాబితా నుంచి, తొలగించే ప్రక్రియచేపడుతున్నట్లు తెలిపారు. ఈ వివరాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులదృష్టికితీసుకురావాలని సూచించారు. 2002 నాటి ఓటర్ల జాబితాలో మ్యాపింగు, కానీ ఓటరు కి నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. సంబంధిత నోటీసులు వారం రోజుల్లో ఓటర్ల ఇళ్లకు చేరుతాయని నోటీసులు అందుకున్న వారు అందులో పేర్కొన్నగడువులోగా అవసరమైన ఆధారాలనుసంబంధిత (బిఎల్ఓ)లకు సమర్పించాలని సూచించారు.

ఆధార్ కార్డు కాకుండా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, కుల ధృవీకరణ పత్రం తదితర గుర్తింపు పత్రాల్లో నిబంధనలకు అనుగుణంగా ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించే అవకాశం ఉంటుందన్నారు. నోటీసులో పేర్కొన్న తేదీన లేదా అంతకంటే ముందే అవసరమైన పత్రాలను సమర్పిస్తే, పరిశీలన అనంతరం సంబంధిత ఓటరు వివరాలను ఆన్‌లైన్‌లో సరిచేసే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అదే విధంగా ఓటర్ల డేటాలో గుర్తించిన అసాధారణతలు ఉన్న వారికి కూడా నోటీసులు జారీ చేస్తున్నట్లు  తెలిపారు.

ముఖ్యంగా పుట్టిన తేదీల్లో తప్పులు, కుటుంబ సభ్యుల మధ్య వయస్సుకు సంబంధించిన అసాధారణ వ్యత్యాసాలు, తెలుగు–ఇంగ్లీష్ అనువాదంలో ఇంటిపేర్లు మారడం వంటి డేటా లోపాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. సంబంధిత ఓటర్లు సరైన ఆధారాలను సమర్పించి తమవివరాలనుసరిచేసుకోవాలని సూచించారు.ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు అనవసరంగా తొలగిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని  ఆదేశించారు.

బిఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసుల పంపిణీ, ఆధారాల స్వీకరణ, వివరాల పరిశీలన తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం చేపట్టాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించాలని  ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు అధికారులకు సహకరించి, తమ ఓటు హక్కు వివరాలను సక్రమంగా నిర్ధారించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మెట్ పెల్లి ఆర్డీవో నరసింహ రావు, తహసీల్దార్ వర ప్రసాద్, ఎంపిడివో, బి ఎల్ వో లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.