ఆయిల్ పామ్ పంట విస్తరణకు చర్యలు
ఇందిరమ్మ ఇండ్ల పురోగతి ఆధారంగా బిల్లుల చెల్లింపు
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట విస్తరణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలం బొంత కుంటపల్లి గ్రామంలో పర్యటించారు. బొంత కుంట పల్లి గ్రామంలోని ఆయిల్ ఫామ్ తోటలను, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోంతకుంటపల్లి గ్రామంలో 30 ఎకరాలలో సాగు అవుతున్న ఆయిల్ పామ్ పంటను పరిశీలించి క్రాప్ ఎప్పటి వరకు వస్తుందో ఆరా తీశారు.
ఆయిల్ పామ్ తోటలో కోకో అంతర్ పంట సాగు చేసుకోవచ్చని తెలిపారు. సుల్తానాబాద్ మండలంలో 350 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.రాబోయే జూన్ నెల నుంచి కొన్ని చోట్ల ఆయిల్ పామ్ పంట కోతలు ప్రారంభమవుతాయని అన్నారు. మండలంలో ఆయిల్ ఫామ్ సాగు మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ తోటలలో నరేగా క్రింద గడ్డి తొలగింపు చేర్చితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు కలెక్టర్ ను కోరారు.
ఆయిల్ పామ్ పంట సంబంధించి అధికారులు కంపెనీ ప్రతినిధుల నుంచి ఎప్పటికప్పుడు సూచనలు అందుతున్నాయని రైతులు తెలిపారు. పంట పురోగతి పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు వచ్చే ఆదాయం గురించి విస్తృతంగా ప్రచారం చేసి మరింత వేగంగా పంట విస్తరణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు ప్రభుత్వం రెగ్యులర్ గా విడుదల చేస్తుందని తెలిపారు. బొంతకుంటపల్లి గ్రామంలో ఆసరి రమ్య అనే లబ్ధిదారులు కడుతున్న ఇం




