గోదావరి ఇసుక తవ్వకాలపై సీబీఐ విచారణ జరపాలి
- 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల రాజ్యాంగ హక్కు లను కాపాడాలి
- గవర్నర్‌కు వినతిప్రతం అందజేసిన మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, ఆదివాసీల నాయకులు
హైదరాబాద్, జూన్ 11(విజయక్రాంతి): ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల రాజ్యాంగ హక్కులు, భూములు, జీవనాధారాలు, సాంస్కృతి, భాష, సహజ వనరులు, స్వయంపాలనను పరిరక్షించేందుకు గవర్నర్ ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలని ఆల్ ఇండి యా ఆదివాసీ రాజ్యాంగ హక్కులు తి పరిరక్షణ సమితి నాయకులు కోరారు.
ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, సలహాదారు, మాజీ డీజీపీ డాక్టర్ జే.పూర్ణచంద్రరావు ఐపీఎస్, మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ ఐఏఎస్, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు తదితరులు గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి వినతిప్రతం అందజేశారు. 5వ షెడ్యూల్, పెసాచట్టాం, అటవీ హక్కుల చట్టాం, 1/70 భూ బదలాయింపు నియంత్ర ణ చట్టం ఉన్నప్పటికీ ఆదివాసీలు భూ పరాయీకరణ, నిరుద్యోగం, నిరాసితత్వం, స్వయం పాలన లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
జీవో 3 రద్దు నేపథ్యంలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక గిరిజన యువత ఉపాధి రక్షణకు కొత్త రాజ్యాంగ పరిరక్షణలు కల్పించాలని గవర్నర్‌ను కోరారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా భద్రా ద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వర కు తవ్విన ఇసుక పరిమాణాం, వచ్చిన ఆదా యాం, ఖర్చు చేసిన నిధులు, ఆదివాసీ ప్రాం తాల అభివృద్ధికి వినియోగించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
ఇసు క తవ్వకాల వ్యవహారాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ఆదివాసీ కుటుంబాలకు పూర్తి పునరావాసం, నష్ట పరిహారం కల్పించాలని, ‘మా ఊర్లో మా రాజ్యం’ స్ఫూర్తితో పెసా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, కోయ/కోయతూర్ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని, ఆదివాసీలకు ప్రత్యేక మత కోడ్ కల్పించాలని వినతి పత్రంలో కోరారు.
షెడ్యూల్ ప్రాంతాల్లో లభిం చే ఖనిజాలు, అటవీ సంపద, ఇసుక, నీటి వనరుల ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమై న వాటాను స్థానిక ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాలన్నారు. రాజ్‌భవన్‌లో ప్రత్యేక గిరిజన సెల్ ఏర్పాటు చేసి పంచమ షెడ్యూల్ అమలును పర్యవేక్షించాలని గవర్నర్‌ను కోరారు. కార్యక్రమంలో పరంజ్యోతి, సం గెం సూర్యారావు, పాయం సత్యనారాయణ, మడావి నర్సింగరావు, వాసం రామకృష్ణ, కుర్సంగి మోతీరాం, అడ తాను, పోదెం కృష్ణప్రసాద్, రామ్మూర్తి, కబ్బక శ్రవణ్‌కుమార్, లోకిని రాజు, సడిమెక సంజీవ్ పాల్గొన్నారు






