8 July, 2026 | 8:44 PM

Breaking News

సమస్యలు పరిష్కరించాలని వినతి   •   ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన చావా రామకృష్ణ   •   ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి   •   ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు   •   పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •  

గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు

08-07-2026 08:12 PM

37 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించగా 27 మంది ఎంపిక

హైదరాబాద్‌లో మూడు నెలల ఉచిత శిక్షణ, వసతి

శిక్షణ తర్వాత ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యకు అవకాశం

ఎంపికైన అభ్యర్థులను అభినందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ 'గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్' ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలలో 27 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన మొత్తం 37 మంది విద్యార్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వారిలో ప్రతిభ కనబరిచిన 27 మందిని సంస్థ ఎంపిక చేసిందని వివరించారు.

ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ప్రతిభ

పెద్దపల్లి బాలురు & బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మంథని బాలుర కళాశాల, గోదావరిఖని బాలికల కళాశాల, ధర్మారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంథని మైనారిటీ బాలికల జూనియర్ కళాశాల మరియు ధర్యాపూర్ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు.

ఉచిత శిక్షణ – వసతి – ఉన్నత విద్యకు గోల్డెన్ ఛాన్స్

ఎంపికైన విద్యార్థులకు ఈ నెల (జూలై) 22వ తేదీ నుండి హైదరాబాద్‌లో మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందని, ఈ శిక్షణా కాలంలో విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను గ్రాన్యూల్స్ ఇండియా సంస్థే భరిస్తుంది. పరిశ్రమల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేలా ఈ శిక్షణ ఉంటుందని, శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సంస్థలో ఉద్యోగంతో పాటు, భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించేందుకు కూడా కంపెనీ పూర్తి సహకారం అందిస్తుందని, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు ఇలాంటి సువర్ణ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు.

భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలను జిల్లాకు రప్పించి, స్థానిక యువతకు పెద్దపీట వేసేలా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగాలు సాధించిన 27 మంది విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి జిల్లాకు, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి  డిఐఈఓ కల్పన, జిల్లా యువజన క్రీడల అధికారి డివైఎస్ఓ సురేష్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ హెచ్‌ఆర్ మేనేజర్ ఎం. ప్రభాకర్ రావు, హెచ్‌ఆర్ ప్రతినిధి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.