2 July, 2026 | 11:33 AM

Breaking News

ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •  

ఆనంద నిలయాన్ని సందర్శించిన కలెక్టర్: మను చౌదరి

21-03-2025 08:21 PM

కొండపాక: కొండపాక మండల కేంద్రంలో ఉన్న ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి(Collector Manu Chowdary) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, పూజారులు శాలువా, పువ్వుల దండతో కలెక్టర్ ను సన్మానించారు. అనంతరం ఆనంద నిలయంలో వృద్ధుల గదులను, పరిసరాలను, డైనింగ్ హాలు వసతులను పరిశీలించి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బాలసదానంలో ఉన్న చిన్నారులు వారి సౌకర్యాలను పరిశీలించి, ఏ రంగంలో విజయం సాధించాలన్న ఇప్పటినుంచి క్రమశిక్షణతో కష్టపడి చదవాలని, వార్తాపత్రికలు చదవాలని, కంప్యూటర్ నాలెడ్జి పెంచుకోవాలని అన్నారు. కంప్యూటర్ ను అందిస్తానని తెలిపారు. ప్రధాన రహదారి నుంచి ఆనంద నిలయం వరకు రోడ్డును నిర్మించాలని ట్రస్ట్ సభ్యులు కోరడంతో, రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గజ్వేల్ పంచాయతీరాజ్ ఈఈ చిరంజీవికి సూచించారు. ఈ కార్యక్రమంలో కొండపాక మండల తాహసీల్దర్  దిలీప్ కుమార్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఆనంద నిలయం ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.