15 March, 2026 | 8:16 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్

05-11-2024 01:01 PM

కరీంనగర్ (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మహితాపూర్ మరియు రామోజీపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు. సంబంధిత ఏఈఓ ను కేంద్రం ఏ విధంగా నడుస్తుంది అని తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, ఎమ్మార్వో ఖయ్యూం, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.