15 March, 2026 | 6:50 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

కారు, ఆటో, బైక్ ఢీ.. మహిళ మృతి

05-11-2024 11:48 AM

నలుగురికి తీవ్ర గాయాలు..

యాచారం (విజయక్రాంతి): కారు, ఆటో, బైకు మూడు ఒక దానికి ఒకటి ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలై, 11 మంది స్వల్పంగా గాయపడిన సంఘటన సోమవారం  అర్ధరాత్రి యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నందివనపర్తి, గ్రామానికి చెందిన 14 మంది మహిళలు మాడ్గుల మండలం పరిసర ప్రాంతాల్లో పత్తి, పొలాల్లో పనిచేయటానికి కూలికి వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా యాచారం మండల కేంద్రంలోని డిఎస్ఆర్ గార్డెన్ వద్ద వెనక నుంచి వచ్చిన కారు ఆటోను ఢీకొనగా అది బైకును ఢీకొని పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పడిపోవడంతో బుచ్చమ్మ (40), యాదమ్మ (38), అండాలు (36) ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అరుణ్ సాయి, (28) నరేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

మరో 11 మంది స్వల్పంగా గాయపడటంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చికిత్స కోసం 108 అంబులెన్స్ లో మాల్ లోని పీపుల్స్ ఆసుపత్రికి తరలించారు. బుచ్చమ్మ, (40) పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.