25 July, 2026 | 8:06 PM

Breaking News

రాజగోపాల్ రెడ్డిని విమర్శించే అర్హత సామెల్ కు లేదు

25-07-2026 07:01 PM

- దళిత నాయకులకు పెద్దపీట వేస్తున్న రాజగోపాల్ రెడ్డి  

- సామెల్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు

మునుగోడు,(విజయక్రాంతి): రాజగోపాల్ రెడ్డిని విమర్శించే అర్హత సామెల్ కు లేదని,దళిత నాయకులకు ఆయనే పెద్దపీట వేశారు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా యావత్తు తెలంగాణకు ఆయన ఆదర్శం" అని మునుగోడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీమనపల్లి సైదులు అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలను ఆయన  తీవ్రంగా ఖండించారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టికెట్ కోసం రాజగోపాల్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగి, ఆయన సహకారంతోనే గెలిచానని సామెల్ మీడియాతో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. "సాయం చేసిన వారిపై బురద జల్లడం నీచం. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకుంటే దళితుల చేతిలో చెప్పుదెబ్బలు తప్పవు" అని హెచ్చరించారు.