calender_icon.png 5 December, 2024 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన బుక్ లెట్ ను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రావీణ్య

07-10-2024 04:23:53 PM

హనుమకొండ: రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవల వివరాలతో కూడిన బుక్ లెట్ ను  హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆవిష్కరించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆరోగ్యశ్రీ పథకంలో అందించే శస్త్ర చికిత్సలు, థెరపీల వివరాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన బుక్ లేట్ ను  కలెక్టర్ చేతుల మీదుగా  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో  ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందించే శస్త్ర చికిత్సలు, థెరపిల వివరాలను కలిగిన బుక్ లేట్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిఆర్ఓ  వై.వి. గణేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, పరకాల, హనుమకొండ ఆర్డీవోలు డాక్టర్ కె.నారాయణ, వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.