11 March, 2026 | 1:06 AM

సావిత్రిబాయి పూలే వర్ధంతి

10-03-2026 08:16 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని రెవిన్యూ క్లబ్  ఆవరణలో పూలే బి సి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గడప కోటేశ్ కుమార్ ఆధ్వర్యములో సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అథితులుగా పూలే బి సి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ, రిటైర్డ్  ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మోసం అంజయ్య, మహమూద్, రిటైర్డ్ తహసిల్దార్ సదుర్ల మల్లేశంలు హాజరై  సావిత్రీబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో అతికం రాజశేఖర్, కోడూరి మీనయ్య, దూడం చంద్ర శేఖర్, ఎలగందుల సదానందం, నూజేటి సత్యనారాయణ రావు. పూసాల విశ్వముకాచారి, సాన నర్సయ్య, యం డి సర్వర్, యన్ సత్యనారాయణ, నాగేశ్వరరావు దయ్యాల బీరయ్య, తదితరులు పాల్గొన్నారు.