30 June, 2026 | 10:12 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నిర్ణీత వేగ పరిమితితో వాహనాలు నడపాలి

10-03-2026 08:09 PM

సీఐ నాగేశ్వర రావు 

జాజిరెడ్డిగూడెం: ట్రాక్టర్ డ్రైవర్లు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా, రోడ్డు భద్రతా నియమాలు  పాటిస్తూ నిర్ణీత వేగపరిమితితో వాహనాలు నడపాలని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కోరారు. మండల కేంద్రం అర్వపల్లిలోని సూర్యాపేట-జనగాం 365(బీ) జాతీయ రహదారిపై అర్వపల్లి ఎస్సై ఈట సైదులు ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మండల కేంద్రంలో వాహనాల తనిఖీని పటిష్టంగా నిర్వహించమన్నారు.

మండల పరిధిలోని మూసి పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ ఇసుక రీచ్ ఉండటం వల్ల ఇసుక ట్రాక్టర్లు అధికంగా తిరుగుతున్నాయని, వాటి కట్టడి కోసం స్పెషల్ డ్రైవ్ జరిపి వాహనాలకు ఉన్న సౌండ్ సిస్టం తొలగించారు. అలాగే రాత్రివేళ వాహనం కనపడే విధంగా వాహనాల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఈట సైదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.