ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ “తోఫా” కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజీబుద్దీన్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ... రంజాన్ నెలలో మసీదుల్లో నిర్వహించే ఇఫ్తార్ విందుల కోసం ప్రతి డివిజన్‌లో ఒక మసీదుకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సహాయంతో మసీదుల్లో సామూహిక ఇఫ్తార్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సోదరభావం మరింత బల పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బోడుప్పల్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహారెడ్డి, తుంగతుర్తి రవి, మాజీ మేయర్లు అమర్ సింగ్, తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సీస వెంకటేష్ గౌడ్, సింగిరెడ్డి పద్మా రెడ్డి, ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు, మహిళలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




