7 March, 2026 | 8:12 PM

కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది

07-03-2026 04:52 PM

* జిల్లా కలెక్టర్ రాజర్షి షా

* విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

ఉట్నూర్,(విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి పడి కాకుండా ఇష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలోని గురుకుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరాలలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఉట్నూరు మండలం షాంపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొని వైద్యులకు పలు సూచనలు చేశారు.

అక్కడి నుండి ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ లోని గిరిజన బాలికల గురుకుల విద్యాలయంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భోజనశాలను పరిశీలించి, స్టాక్ రూమ్ లో సరుకులపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. అటు బాలికలతో కలిసి మధ్యన్న భోజనం చేశారు. బాలికలకు ఇలాంటి భోజనం ప్రతిరోజు అందించాలని ప్రిన్సిపాల్ శ్రీప్రియతో పాటు వార్డెన్  ప్రియాంక కు సూచనలు చేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలలో చదువుకునే విద్యార్థులు సెల్ ఫోన్లు తీసుకురాకుండా కట్టిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా అదనపు వైద్య అధికారి డాక్టర్ కూడ్మేత మనోహర్, పీఎస్సీ వైద్యురాలు పూజిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.