చదువుకుంటేనే సమాజంలో మహిళల గౌరవం
07-03-2026 04:55 PM
నిర్మల్,(విజయక్రాంతి): నేటి సమాజంలో ఏ రంగంలోనైనా మహిళలు రాణిస్తున్నారని దానికి చదివే ప్రధాన కారణమని నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పల కావ్య అన్నారు. శనివారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయపరంగా ఎదిగేందుకు చదువుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు అధికారులు ఉన్నారు.




