22 May, 2026 | 4:10 AM

లింగాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

22-05-2026 01:58 AM

ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

అచ్చంపేట, మే 21: లింగాల మండలంలో ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేసి రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తార్పులు వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారులకు ఇసుక, నిర్మాణ సామగ్రి సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.