5 July, 2026 | 2:26 AM

ప్రీ క్వార్టర్స్‌లో కొలంబియా

05-07-2026 12:17 AM

కన్సాస్ సిటీ, జూలై 4 : సాకర్ ప్రపంచకప్‌లో కొలంబియా ప్రీ క్వార్ట ర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఘనాతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఆ జట్టు 1 స్కోరుతో విజయం సాధించింది. 14వ నిమిషంలోనే కొలంబి యా ప్లేయర్ జాన్ అరియాస్ గోల్ కొట్టాడు.

ఇదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది. సువారెజ్ అందించిన క్రా స్‌ను అద్భుతంగా గోల్ పోస్టులోకి పంపించాడు. ఆ తర్వాత ఘనా స్కోరు సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొలంబియా డిఫెన్స్‌ను ఛేదించడంలో విఫలమైంది. ప్రీ క్వార్టర్స్‌లో కొలంబియా, స్విట్జర్లాండ్‌తో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఈజిప్ట్ పెనాల్టీ షూటౌట్‌లో గెలిచి ముం దంజ వేసింది.