4 July, 2026 | 12:56 AM

అదరగొట్టేది ఎవరో?

04-07-2026 12:21 AM

నేడు భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20

వైభవ్‌కు చోటు కష్టమే

సంజూకు చివరి ఛాన్స్

వర్షం అడ్డుపడే అవకాశం

తొలి మ్యాచ్‌లో భారత్ భారీస్కోరు చేసినా వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు రెండో టీ20లో అందరి చూపు సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉన్న సంజూను కొనసాగిస్తారా లేక చిచ్చర పిడుగు వైభవ్‌కు అవకాశమిస్తారా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మాంచెస్టర్, జూలై 3: భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. తొలి టీ ట్వంటీలో భారత్ మంచి స్కోరే చేసినప్పటకీ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు రెండో మ్యాచ్ తో సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉవ్విళ్ళూరుతున్నాయి.

ఐర్లాండ్ సిరీస్ లో ఓటమితో విమర్శలు ఎదుర్కొంటున్న టీ మిండియా ఇంగ్లీష్ గడ్డపై దుమ్మురేపాలని ఎదురుచూస్తోంది. ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ గెలిచి ఐర్లాండ్ ఓటమితో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం భారత తుది జట్టు కూర్పుపైనే సస్పెన్స్ నెలకొంది. చిచ్చర పిడుగు వైభవ్ సూర్య వంశీని తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఐ ర్లాండ్‌పై రెండు మ్యాచ్‌లలోనూ, ఇం గ్లాం డ్‌పై తొలి టీ20లోనూ సంజూ శాంసన్ విఫలమయ్యా డు. దీంతో సంజూ స్థానంలో వై భవ్‌కు అవకాశాలివ్వాలన్నది మాజీ క్రికెటర్ల అభిప్రాయం. అయితే టీమిండియా మేనేజ్ మెంట్ మాత్రం అతని విషయంలో క్లారిటీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచకప్ విజ యంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాం సన్‌కు వరుస అవకాశాలు ఇస్తామని గతంలోనే టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. రెండో టీ20 సంజూకు చివరి అవకాశంగా చెప్పొచ్చు.

మిగిలిన జట్టులో పెద్దగా మా ర్పులు జరిగే అవకాశాలు కనిపించ డం లేదు. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆడనుండగా.. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ తర్వాత శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే బరిలోకి దిగుతారు. అభిషేక్‌శర్మ తొలి టీ 20లో అదరగొట్టాడు.   మిగిలిన బ్యాటర్లు కూడా చెలరేగితే భారీస్కోరు ఖాయం. శ్రేయ స్ అ య్యర్ కూడా సూపర్ ఫామ్‌లో ఉండగా చివర్లో శివమ్ దూబేపై అం చనాలున్నాయి. అటు పేస్ విభాగంలో హర్షిత్ రాణా, అర్ష దీప్ సింగ్ కీల కం కానున్నారు. మరో పే సర్ కావాలనుకుంటే మాత్రం ప్రిన్స్ యాదవ్ ఆడతాడు. 

తుది జట్ల అంచనా

భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్, వరుణ్ చక్రవర్తీ

ఇంగ్లండ్ : ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరణ్, లియమ్, ఆదిల్ రషీద్ జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహమ్మూద్