5 July, 2026 | 2:24 AM

అర్జెంటీనా అతికష్టంగా..

05-07-2026 12:18 AM

కాబో వెర్డ్ అద్భుత పోరాటం

మియామి, జూలై 4 :వరల్డ్ ఛాంపియన్ అర్జెంటీనాకు కాబో వెర్డ్ వణుకు పుట్టించిం ది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం కంటే కాబో వెర్డ్ పోరాటమే హైలెట్‌గా నిలిచింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు అర్జెంటీనాకు చుక్క లు చూపించింది.

అయితే కెప్టెన్ లియోనెల్ మెస్సితో పాటు అనుభవం కలిగిన అర్జెంటీ నా చివరకు 3 తేడాతో అతికష్టంగా గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. మెస్సి 29వ నిమిషంలో గోల్ చేసి అర్జెంటీనాకు 1- లీడ్ ఇ చ్చాడు. అయితే, కాబో వెర్డ్ ప్లేయర్ డెరాయ్ డుర్తే 59వ నిమిషంలో గోల్‌తో స్కోరు స మం చేశాడు. మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా 2- ఆధిక్యంలో నిలిచినా వెంటనే కాబో వెర్డ్ స్కోరు సమం చేసింది. చివరికి అర్జెంటీనా ఆటగాడు డినే 111వ నిమిషంలో గోల్ చేసి జట్టును గెలిపించాడు.