1,120 కిలోల గంజాయి దహనం
02-10-2024 12:51 AM
ఖమ్మం, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని ఆరు ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 72 కేసుల్లో పట్టుకున్న 1,120 కిలోల గం జాయిని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పర్యవేక్షణలో మం గవారం దహనం చేశారు. ఏడబ్ల్యూఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్ నేతృత్వంలో తల్లాడ మండలం గోపాలపేటలో గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, ఏఈఎస్ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.






