యూట్యూబర్ బెహరా ప్రసాద్ అరెస్ట్
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ యూట్యూబ్ నటుడు బెహరా ప్రసాద్ అరెస్టు అయ్యారు. మణికొండలోని ఓ యువతిని వేధించినందుకు బెహరా ప్రసాద్ ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ప్రసాద్ ఓ వెబ్ సిరిస్ షూటింగ్ సమయంలో తనకు పరిచయమయ్యాడని, షూట్ లో భాగంగా తనతో అసభ్యంగా ప్రవర్తించేవడాన్ని.. ఇదేంటని నిలదీస్తే క్షమాపణలు చెప్పాడని యువతి పేర్కొంది.
కొన్నిరోజుల తర్వాత మరో వెబ్ సిరిస్ లో కలిసి పనిచేస్తుంటే మళ్లీ అలాగే అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నవని ప్రశ్నిస్తే పరుష పదజాలంతో దూషించాడని బాధితురాలు వాపోయింది. ఈ నెల 11వ తేదీన షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తుంటే యూనిట్ అందరి ముందు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.






