7 June, 2026 | 2:20 AM

ఆ అనుభూతిని ఇంట్లో పొందలేం!

07-06-2026 12:52 AM

టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ కుర్రకారులో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. త్వరలో ఈ భామ బాలీవుడ్ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

“తెలుగు సినిమా నాకు పెద్ద స్కేల్, ఆడియన్స్ ఎనర్జీని నేర్పింది. తమిళ మూవీ కొన్ని సీన్లలో సైలెంట్‌గా ఎలా నటించాలో నేర్పింది. హిందీకి వేరే పద్ధతులుంటాయి. నటిగా మనం మారకుండానే, అన్ని ఇండస్ట్రీల స్టైల్‌ను అలవాటు చేసుకోవాలి. కమర్షియల్ సినిమాలు స్క్రీన్ మీద చూసేందుకు చాలా ఈజీగా అనిపించినా.. గ్లామర్, ఎమోషన్, కామెడీ, డ్యాన్స్, యాక్టింగ్.. ఇవన్నీ ఒకేసారి పర్ఫెక్ట్‌గా చేయడం నటీనటులకు చాలా కష్టమైన విషయ.

ఈరోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారాలు, రీల్స్ వంటి షార్ట్ వీడియోలు ఎక్కువైపోవడంతో.. థియేటర్లలో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి పెద్ద పరీక్ష ఎదుర వుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లలో ఏ సినిమా చూడాలో ఎంచుకునే విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. మూవీ చూస్తున్నప్పుడు అది మనసుకు హత్తుకుందా.. లేదా? అనేది ప్రేక్షకులు చాలా త్వరగా కనిపెట్టేస్తున్నారు.

ఇప్పుడు ఎవరినీ అబద్ధపు ఎంటర్‌టైన్‌మెంట్‌తో మోసం చేయలేం. ఎందుకంటే వాళ్లకు ఫోన్లలోనే సినిమాలు చూసేం దుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. థియేటర్‌లో అందరితో కలిసి కూర్చుని సినిమా చూడటంలో ఒక వేరే మజా ఉంటుంది. అందరూ కలిసి నవ్వడం, చప్పట్లు కొట్ట డం, డ్యాన్స్ చేయడం అనే అనుభూతిని ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో అస్సలు పొందలేం. అందుకే కమర్షియల్ సినిమాలకు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు” అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.