28 July, 2026 | 3:34 PM

కేసీఆర్ పార్కును తెరవాలి

28-07-2026 03:00 PM

- బీఆర్ఎస్ నాయకుల వినతి

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కేసిఆర్ పార్క్ మూడు నెలలుగా మూసి ఉన్నప్పటికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మూసి ఉన్న కేసిఆర్ పార్కును తెరవాలని కోరుతూ మంగళవారం మున్సిపాలిటి కమిషనర్ కు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రజలు, చిన్నారులు, వృద్ధులు ఈ పార్క్‌ కు వచ్చి ఉపశమనం పొందేవారని, అలాంటి ఈ పార్కును ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రజలకు ఉపయోగపడే పార్క్‌ను వెంటనే పునఃప్రారంభించి, నిర్వహణను మెరుగుపరచాలని మంత్రిని డిమాండ్ చేశారు.