7 June, 2026 | 2:20 AM

పోలీస్ ఆఫీసర్‌గా తొలిసారి!

07-06-2026 12:51 AM

దక్షిణాది సినీప్రియుల అభిమాన హీరోయిన్ సాయిపల్లవి నిరుడు తెలుగులో ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పు డు బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ‘డీ-55’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలోనూ సాయిపల్లవి ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

‘అమరన్’ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాను పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టును వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇందులో సాయిపల్లవితో పాటు శ్రీలీ, ఎస్‌జే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటు న్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమై న వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందులో సాయిపల్లవి ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతోం దనేదే ఆ వార్త సారాంశం. ఇప్పటివరకు హోమ్లీ, ఎమోషనల్ పాత్రల్లో మెప్పించిన సాయిపల్లవి.. ఈ సినిమాలో తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి యాక్షన్ సన్నివేశాలతో అలరించనుందని సమాచారం. ధనుష్, -సాయిపల్లవి కాంబోలో గతంలో వచ్చిన ‘మారి-2’లోని ‘రౌడీ బేబీ..’ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబోలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి సినిమా తీస్తుండటంతో ఆసక్తిని రేకెత్తిస్తుండగా.. సాయిపల్లవి పోలీస్ ఆఫీసర్ అనే తాజా వార్త ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.