13-02-2026 12:00:00 AM
సైబరాబాద్ సీపీ ఎం.రమేష్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి ౧౨ (విజయక్రాంతి): సైబరాబాద్ 24వ ఆవిర్భావ దినోత్స వ వేడుకల సందర్భంగా గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 2003 లో స్థాపించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతానికి సేవలందిస్తున్న ప్రముఖ అర్బన్ పోలీసింగ్ వ్యవస్థగా నిలిచిందని గుర్తుచేశారు.
సాంకేతికతను వినియోగిస్తూ ఆధునిక పోలీసింగ్లో సైబరాబాద్ కమిషనరేట్ దేశ, అంత ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని, ప్రత్యేక నేర విభాగాలు, సైబర్ ఎన్ ఫోర్స్ మెం ట్ యూనిట్లు, ప్రజలతో భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా భద్రతను మరింతగా బలోపే తం చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, శేరిలింగంపల్లి డీసీపీ సి.హెచ్. శ్రీనివాస్, అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వై.వి.ఎస్. సుధీంద్ర, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్, ఎస్‌ఓటీ డీసీపీ శోభన్ కుమార్, ట్రాఫిక్-1 డీసీపీ రంజన్ రతన్ కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.