15 June, 2026 | 6:14 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

క్రీడా, చదువులపై మక్కువ చూపాలి

13-02-2026 12:00 AM

జిల్లాతో పాటు మండల కేంద్రానికి కల్పిస్తాం 

సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

 గోపాలపేట ఫిబ్రవరి 12: విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో బాగా రాణించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గురువారం గోపాలపేట మండల కేంద్రంలో జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత బాలుర పాఠశాల మైదానంలో సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే జ్యోతి ప్రజల చేసి జిల్లా స్థాయి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి ఎందుకు చేస్తున్నారని అన్నారు.

చదువుతోపాటు క్రీడారంగంలో రాణించి ఆ రంగాలలో కూడా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చని చెప్పారు. ఈ జిల్లా పరిషత్ పాఠశాలకు రావడం ఈ రెండేళ్లలో నాలుగు సార్లు వచ్చానని పాఠశాలలో ఉన్న సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. ఈ పాఠశాల మైదానం చుట్టూ ప్రహరీ పాఠశాలకు గదులు ఏ సమస్యలున్నా తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు గోపాలపేట మండల కేంద్రానికి కూడా అభివృద్ధిలో తీసుకురావడానికి నేను ముందుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జరిగే గ్రామసభల్లో కూడా తాను పాల్గొని గ్రామ సమస్యలను తెలుసుకుంటానని చెప్పారు.

అనంతరం ఫుట్బాల్ కబడ్డీ కోకో జిల్లా స్థాయి పోటీలలో 6oజట్లు పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. ఈ క్రెటా పోటీలలో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను స్టేట్ లెవెల్ లో సీఎం కప్పు ఉంటుందని పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెచ్‌ఎం సురేందర్ రెడ్డి ఉపాధ్యాయులు యాదగిరి, నాయకులు శివన్న జైపాల్ రెడ్డి గాజుల కోదండo, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.