calender_icon.png 8 August, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు

08-08-2025 01:24:03 AM

పటాన్ చెరు(జిన్నారం), ఆగస్టు 7 : కులం పేరుతో దూషించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నిర్మాణ కార్యదర్శి కే అంబదాసు గురువారం తెలిపారు. గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారంలో వాటర్ మెన్ గా పనిచేసే మంత్రి గణేశ్ ను అదే గ్రామానికి చెందిన వ్యక్తి నీటి సరఫరా విషయంలో కులం పేరుతో దూషించి కించపరిచారని, దీనిపై బొల్లారం పోలీసులకు ఏఐఎస్‌ఎస్‌డీ నాయకులు, ఎస్సీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేసినట్లు అంబ దాసు తెలిపారు.