08-08-2025 01:23:51 AM
మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): సైబర్ నేరాలు, ఈవిటీజింగ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్యవివాహాలపై గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాఠశాల బాలికల విద్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని మహబూబాబాద్ షీ టీం, భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర సునంద మాట్లాడుతూ నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని,
జాగ్రత్తతో మెలగడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని సూచించారు. షీ టీం, భరోసా, యాంటీ వుమెన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్స్, డ్రగ్స్, మైనర్ డ్రైవింగ్ పై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే 8712656935 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ కోటియా నాయక్, షీ టీం, భరోసా సిబ్బంది అరుణ, పార్వతి, సౌభాగ్య, రమేష్, జోష్ణ, రేణుక పాల్గొన్నారు.