ఘనపూర్‌లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు
ఘట్ కేసర్, మే 26 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, అదిలాబాద్ డివిజన్ పరిధిలోని ఘనాపూర్ లో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు పూర్తి చేస్తున్న విషమై మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్ సర్కిల్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదును అందజేశారు. ఘనపూర్ గ్రామ రెవెన్యు పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు నిర్వస్తున్నరని గత రెండు నెలలుగా ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయoలో ఫిర్యాదులు చేసినట్లు పేర్కొన్నారు.
కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కనీస చర్యలు తీసుకోలేదన్నారు. పిల్లర్ల దశ నుండి ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ టిపిఓ సిబ్బంది వెళ్ళడం, రావడం తప్ప ఎలాంటి చర్యలు తెపట్టలేదన్నారు. దీంతో ఈనెల 24 ఆదివారం రాత్రి యదేచ్చగా స్లాబు నిర్మాణం పూర్తి చూశారని ఈ విషయం టిపిఓ, డిసి లకు తెలియజేసినట్లు తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇక్కడ ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే రెండు వందల అడుగుల దారి నుండి నల్ల కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ సైతం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
అనేక మంది అధికారుల చుట్టూర తిరుగుతున్నప్పటికి నల్ల కనెక్షన్ కానీ డ్రైనెజ్ కనెక్షన్ ఇవ్వడానికి అనుమతించని అధికారులు ఇక్కడ మాత్రo అక్రమ నిర్మాణానికి అన్ని ముందే ఇచ్చి అధికారులు తమ ఘనతను చాటుకుంటున్నారని తెలిపారు. బిల్డర్లకు కార్పొరేషన్ పరిధిలోని ఆయా విభాగాల సిబ్బంది అండగా ఉంటూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. రాత్రి సమయంలో సిబ్బంది సమక్షంలోనే స్లాబ్ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.
ఇలా ఇటీవల ఎలాంటి అనుమతులు లేకుండానే అనేక ఇండ్ల నిర్మాణాలు జరిగాయని, సర్కిల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఘనపూర్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల పై పూర్తి విచారణ జరిపి కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై అలాగే అక్రమ నిర్మాణాలకు అండగా ఉంటున్న టిపిఓ తో పాటు వారి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ సంజీవ గౌడ్ విజ్ఞప్తి చేశారు.






