27 May, 2026 | 2:43 AM

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్

27-05-2026 01:44 AM

దోమకొండ,మే 26, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సీతారాం పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మంగళవారం పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మరియు కొలతల ప్రకారం కూలీలు రావాలని సంబంధిత ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశించడం జరిగింది.

కొలతల ప్రకారం పనులు చేయాలని పూజ కూడా తెలియజేయడం జరిగింది మరియు ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు ఇట్టి పనులు పూర్తి చేసుకొని వెళ్లాలని ఉపాధి హామీ కూలీలకు తెలియజేయడం జరిగింది మరియు వారికి కూలీలకు మౌలిక వసతులు అనగా త్రాగునీరు ఓఆర్‌ఎస్ ప్యాకెట్స్ ఫర్ స్టేట్ బ్యాంక్ షేర్ నెట్ మొదలగునవి సదుపాయాలు కల్పించవలసిందిగా సంబంధిత సిబ్బందిని ఆదేశించడం జరిగింది.

అలాగే గ్రామంలో నిర్మిస్తున్న నూతన గ్రామపంచాయతీ భవనంను పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను కూడా పరిశీలించి సరిత గతిన పూర్తి చేసుకోవాలని జూన్ రెండవ తారీకు అనగా మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు గనుక ఆ రోజు సామూహిక గృహప్రవేశాలు మన దోమకొండ మండలంలో పెద్ద మొత్తంలో జరగాలని గౌరవ సర్పంచ్లకు పాలకవర్గానికి ఇట్టి విషయంలో శ్రద్ధ చూపి ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని చివరి దశలో ఉన్నారో వారి ని గుర్తించి ఇట్టి గృహప్రవేశాలు చేయుటకు సహకరించాలని కోరడం జరిగింది