అనుమతిలేని షెడ్డు నిర్మాణం నిలిపివేత
27-05-2026 01:46 AM
ఘట్‌కేసర్, మే 26 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ పరిధి అన్నోజిగూడలోని నారాయణ కళాశాల వద్ద ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న షెడ్డు పనులను టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిలిపివేసినట్లు వార్డు ఆఫీసర్ వెంకటేశ్ మంగళవారం తెలిపారు. షెడ్డు నిర్మాణం కోసం ఎలాంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ పనులు కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికార పార్టీని అడ్డు పెట్టుకొని కొందరు నాయకులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నుట్లు స్థానికులు పేర్కొన్నారు.






