29 April, 2026 | 11:21 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

పాలక వర్గానికి సమాచారం ఇవ్వకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తారా?

09-03-2026 09:57 PM

షాద్‌నగర్,(విజయక్రాంతి)గ్రామంలో నిర్వహిస్తున్న సమావేశాలకు ఉపసర్పంచ్ తో పాటు వార్డ్ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నిర్వహిస్తున్నారని, గ్రామ పాలనలో సర్పంచ్ భర్త జోక్యం చేసుకుంటున్నారంటూ కొత్తూరు మండలం కోడిచెర్ల తాండ ఉప సర్పంచ్ స్వప్న రామదాసుతో పాటు పలువురు వార్డు సభ్యు సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

కోడిచెర్ల తాండ ఉప సర్పంచ్ స్వప్న రామదాసు కథనం ప్రకారం... ఈ నేల 7వ తేదీన గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాధారణ సమావేశం (సాధారణ మీటింగ్) మరియు 99 రోజుల ప్రణాళిక గురించి చర్చ జరిగింది. అయితే సర్పంచ్ భర్త  కోర విష్ణు ఎన్నికైన వార్డు సభ్యులను సమావేశ మందిరంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. విషయంపై పాలకవర్గానికి సమాచారం లేకుండా కోడిచెర్ల తండా గ్రామ ప్రభుత్వ 99 రోజుల కార్యక్రమాన్ని ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా సర్పంచ్ శాంతి విష్ణు నాయక్ ఏకపక్షంగా నిర్వహించారని,

అంతేకాకుండా సర్పంచ్ భర్త విష్ణు నాయక్ పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై డిప్యూటీ సర్పంచ్ స్వప్న రాందాస్ మరియు వార్డు సభ్యులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో వార్డు సభ్యులను తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలనీ కొరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సంతోష్ నాయక్, వినోద్ నాయక్, లలిత భాస్కర్ నాయక్, బిచ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.