calender_icon.png 16 May, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంప్లీట్ ఎంటర్‌టైనర్..

10-11-2024 12:00:00 AM

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘ధూం ధాం’. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. 

హీరో చేతన్ కృష్ణ మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగుందంటే తప్ప ఆడియెన్స్ బయటకు రాని ఈ ట్రెండ్‌లో మా మూవీకి 70  80 పర్సెంట్ హౌస్ ఫుల్ కావడం సంతోషంగా ఉంది. సినిమాలో కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని మేము ముందునుంచీ చెబుతూ వస్తున్నాం. దానికే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు” అని పేర్కొన్నారు.

దర్శకుడు సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ..  “ధూం ధాం’ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే పేరు వస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బెనర్జీ, సాయి శ్రీనివాస్ వంటి వారి క్యారెక్టర్స్ చూస్తూ  ప్రేక్షకులు బాగా నవ్వుతున్నారు” అన్నారు. 

నిర్మాత రామ్ కుమార్ మాట్లాడుతూ.. “ -మేము ఇంకా పరుగు స్టార్ట్ చేయలేదు. నిలబడ్డాం అంతే. ‘ధూం ధాం’  సినిమాను థియేటర్ లో ఎక్సిపీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను 2, 3 వందల మంది ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.