31 July, 2026 | 4:47 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

31-07-2026 04:08 PM

నర్సాపూర్: వనమహోత్సవంలో భాగంగా అచ్చంపేట గ్రామంలో ప్రతి కుటుంబానికి ఆరు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నీరుడి తుల్చమ బిక్షపతి మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.

పంపిణీ చేసిన మొక్కలను ప్రతి కుటుంబం తప్పనిసరిగా నాటి, వాటిని సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలనే  లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రావణి, ఆశా వర్కర్ రాణి, పాఠశాల ఉపాధ్యాయుడు రవీందర్‌తో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.