పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
11వార్డులో పట్టణ ప్రగతిలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్
గజ్వేల్ మార్చి 17: ప్రజలంతా తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి మునిసిపల్ సిబ్బందికి అంది స్తూ, నివాస పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సంగాపూర్ లో తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహ న కల్పించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, స్థానిక కౌన్సిలర్ కొలిచెలిమ భవాని కరుణాకర్ లతో కలిసి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన క ల్పించారు. ఇండ్ల పరిసరాల్లో చెత్తాచెదారం వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు.
ప్రజలు సహకరిస్తేనే పరిశుభ్ర మైన ఆరోగ్యకరమైన పట్టణాన్ని తీర్చిదిద్దగలుగుతామన్నారు. అలాగే మున్సిపాలిటీలోని ఆస్తి ప న్నుల పైన సమీక్షించి, వాణిజ్య సముదాయాల సంబంధించిన ఆస్తి పన్నులు ఆశించిన స్థాయిలో వసూలు చేయనందున, ఆస్తి పన్నును రోజువారి లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని వంద శాతం వ సూలు వసూలు చేయాలని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
పెండింగ్ లో ఉన్న కోట మైసమ్మ రోడ్డును చైర్ పర్సన్ అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసు కురాగా, సంబంధిత ఆర్ అండ్ బి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కొలిచేలిమి స్వామి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.




