15 July, 2026 | 8:34 PM

నిర్లక్ష్యం చేయకుండా ఎస్ఐఆర్ దరఖాస్తులు పూర్తి చేసుకోండి

15-07-2026 08:33 PM

మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అర్హులైన ప్రజలెవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ ‘ఎస్ఐఆర్’ (SIR) దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్  సూచించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని 16వ వార్డుతో పాటు పలు వార్డుల పరిధిలో కొనసాగుతున్న ‘ఎస్ఐఆర్’ దరఖాస్తుల ప్రత్యేక కార్యక్రమాన్ని వారు కౌన్సిలర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ తీరును, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... స్థానిక ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్డుల్లో ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాధాన్యతను వివరించి, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దూడల లక్ష్మి, సాలం బీన్ అహ్మద్, రాపర్తి కార్తిక్, బీఎల్ఓ లక్ష్మి, సూపర్వైజర్ సాయి నాయకులు దూడల అశోక్, అబూ తదితరులు పాల్గొన్నారు.