15 July, 2026 | 8:59 PM

వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రికి వినతి

15-07-2026 08:29 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కాచాపూర్ మాజీ సర్పంచ్, భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైండ్ల భూపతి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను ఆయన నివాసంలో కలిసి దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లో జిల్లా పాస్ కలిగిన దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా మంత్రి వెంటనే స్పందించి ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపో మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్టీసీ ఎండీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన బైండ్ల భూపతికి భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ బైండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.