15 July, 2026 | 8:14 PM

బిఎల్ఓలు SIR పత్రాలను పకడ్బందీగా పరిశీలించాలి

15-07-2026 08:13 PM

ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): గ్రామాలలో బిఎల్ఓ లు SIR పత్రాలను పూర్తి సమాచారంతో పరిశీలించి ఆన్ లైన్ చేయించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ అన్నారు. బుధవారం మండలంలోని బూరుగూడ గ్రామంలో  SIR ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలోని బిఎల్ఓ SIR పూర్తి చేసేటప్పుడు పకడ్బందీగా పరిశీలించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు పేరును ఆన్ లైన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజుల జక్కయ్య,మాజీ సర్పంచ్ మేకర్తి కాశయ్య,జిల్లా మైనారిటీ నాయకుడు కలీమ్,బిఎల్ఓ రమాదేవి, గ్రామస్థులు పాల్గొన్నారు.