15 July, 2026 | 8:20 PM

PRTUTS సభ్యత్వ నమోదు ప్రారంభం

15-07-2026 08:19 PM

బేల,(విజయక్రాంతి): PRTUTS బేల మండల శాఖ సభ్యత్వ నమోదును బుధ వారం జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్, ప్రధాన కార్యదర్శి టీ నరసింహ స్వామిలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం PRTUTSతోనే సాధ్యమన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న  DA, PRC లు, సర్వీస్ రూల్స్,హెల్త్ కార్డులు త్వరలో సాధించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పి.ఆర్.సి, డిఏలు, అనేక రకాల బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో సగటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇబ్బందవుతుందన్నారు. ప్రభుత్వము వెంటనే పిఆర్సి నివేదికను తెప్పించుకొని 51 శాతం ఫిట్మెంట్ తో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వము, హైకోర్టు 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ అమలుపరుస్తామని చెప్పి దాదాపు మూడు సంవత్సరాలైనా అమలు చేయకపోవడం దురదృష్టకరమమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ దేవరావ్, సిహెచ్ నితిన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్రపు ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి రూపావత్ మదన్ లాల్, మండల అసోసియేషన్ అధ్యక్షులు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.