10 July, 2026 | 10:43 AM

ప్రమాదకరంగా మారిన కాంపౌండ్ వాల్ పునాది గుంతలు

10-07-2026 10:11 AM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ కట్టేందుకు తవ్విన గుంతలు అలాగే విడిచిపెట్టడంతో వర్షాకాలం గుంతల్లో నీరు నిలిచింది దీంతో 15వ వార్డు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు రోడ్డు పక్కనే ఉన్న ఈ గుంతల వద్దకు చిన్నపిల్లలు ఆడుకునేందుకు వెళితే ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని కాల్ మీ వాసులు అంటున్నారు ప్రహరీ గోడ నిర్మాణానికి పిల్లల కోసం గుంతలు కావడంతో రోడ్డుకు సమీపంలో నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని పంచాయతీ  వారు పనులను నిలిపి వేయించారు. దీంతో మరోచోట పిల్లర్ గుంతలు తవ్వి ప్రహరీ నిర్మాణం చేపట్టారు దీంతో ముందు తవ్విన పిల్లర్ గుంతలను అలాగే వదిలేయడంతో నీరు నిండింది అధికారులు తక్షణమే గుంతలను పూడిచాల్సిన అవసరం ఉందని కాలనీవాసులు అంటున్నారు