10 July, 2026 | 10:39 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్

10-07-2026 10:06 AM

ముకరంపుర, జూలై 10 (విజయక్రాంతి): టీజీఎస్పీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ 2026-27 పరీక్షల కొరకు రెసిడెన్షియల్ పద్ధతిలో ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2027 ముగిసే వరకు శిక్షణ ఇవ్వబడుతుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు, అలాగె తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఈనెల 29న ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుందని  దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఈనెల 19  మరిన్ని వివరాలకు 040-23546552 / 8121626423 సంప్రదించాలని డైరెక్టర్ బండ శ్రీనివాస్ తెలియజేశారు.