12 May, 2026 | 10:01 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ఏఐ సాయంతో సమగ్ర హెల్త్ ప్రొఫైల్

30-01-2025 01:29 AM
  1. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా రూపకల్పన  
  2. రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): కృత్రిమ మేథ(ఏఐ)ను ఉపయోగించి రాష్ర్టంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్‌ను సమగ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లో మాడ్యూర్ హాస్పిటల్ సర్వీసెస్ రూపొందించిన ‘ఎండిఆర్.మై డిజి రికార్డ్’ మొబైల్ యాప్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

ఇటీవలి కాలంలో వ్యాధిగ్రస్తులు ముందుగా ఒక ఆసుపత్రికి వెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని నమ్మకం కుదరక మరో ఆసుపత్రికి వెళ్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ఈ క్రమంలో అక్కడ కూడా ప్రజలు అన్ని వైద్య పరీక్షలను చేయించుకోవాల్సి వస్తుండటంతో ఆర్థికంగా కుదేలవుతున్నారని పేర్కొన్నారు. రాష్ర్టంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వస్తే రోగులపై పడే అదనపు భారం తగ్గుతుందన్నారు.

అలాగే మెరుగైన వైద్యాన్ని వేగంగా పొందేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి కూడా వీలవుతుందని వెల్లడించారు. ఈ క్రమంలోనే హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు మంత్రి చెప్పారు.

ఏఐ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు బీ మహేష్ కుమార్ గౌడ్, మాడ్యూర్ హాస్పిటల్ సర్వీసెస్ చైర్మన్ మోటూరి కృష్ణప్రసాద్, సీఈవో డాక్టర్ సరోజ్ గుప్తా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాక్టర్ క్రిస్ హాంప్రయ్స్ తదితరులు పాల్గొన్నారు.