కొనుగోళ్లలో జాప్యంపై ఆందోళన
18-05-2026 12:00 AM
మల్లాపూర్, మే 17 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో ధాన్యం కొను గోలులో జరుగుతున్న జాప్యంపై ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
గన్ని సంచుల కొరత, హమాలీ సమస్యలు, లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్య మవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఆందోళన నేపథ్యంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.






