బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు
28-06-2025 10:48 PM
సనత్ నగర్,(విజయక్రాంతి): బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైన చుక్క సత్యనారాయణ కి మరియు సురేష్ వర్మ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. దేవస్థాన అభివృద్ధిలో మిమ్మల్ని అలాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో చూసుకోవడం ఆనందదాయకం.సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో సేవ చేస్తున్న మీరు ఇప్పుడు ఈ బాధ్యత ద్వారా మరింత విశేషంగా ఆలయ అభివృద్ధికి, భక్తుల సంక్షేమానికి తోడ్పడగలరు. మీ నాయకత్వంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము.ఈ సందర్భంగా యువ నాయకులు చుక్క సాయికిరణ్ గారు మరియు కళ్యాణ్ కుమార్ గారు ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. వారి శుభాకాంక్షలతో ఈ నూతన పదవికి అభినందనలు తెలియజేస్తున్నాము.




