10 March, 2026 | 10:23 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షలు

09-03-2026 03:07 AM

శంకర్‌పల్లి, మార్చి 8 (విజయ క్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం శంకర్ పల్లి మాజీ సర్పంచ్ బిసోల శ్రీధర్, రాష్ట్ర మాజీ మంత్రి మరియు మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలో పుష్పగుచ్చం అందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. కుటుంబ నిర్వహణ నుండి దేశాభివృద్ధి వరకు మహిళలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆమె పేర్కొన్నారు.