పీఆర్టీయూ టీఎస్ నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు
16-09-2026 | 12:47am
టేకులపల్లి,(విజయక్రాంతి): పీఆర్టీయూ టీఎస్(PRTU TS) టేకులపల్లి మండల నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి రమణలను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అధ్యక్షుడు నరసయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రవీందర్, రాష్ట్ర కార్యదర్శి రాందాస్, కొత్తగూడెం మండల అధ్యక్షుడు కంగల భాస్కర్, టేకులపల్లి మండల కార్యదర్శి వెంకటరామయ్య, మండల అసోసియేట్ అధ్యక్షుడు బాలాజీతో పాటు శంకర్, శివలాల్, లోక్య, దస్రు, రమేష్, సుభద్ర, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.